యూఏఈ ప్రధానికి ట్రయల్‌ కరోనా వ్యాక్సిన్

3 Nov, 2020 16:51 IST|Sakshi

కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్ వాలంటీర్‌గా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 

ట్విటర్‌లో వివరాలు షేర్‌ చేసిన షేక్ మొహమ్మద్

విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ట్రయల్

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం కరోనా వైరస్‌ వ్యాక్సిన్ టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన‍ స‍్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు.  కోవిడ్‌​-19 వ్యాక్సిన్ అందుకుంటున్నప్పుడు అంటూ ఒక చిత్రాన్ని ఆయన షేర్‌​ చేశారు. యూఏఈలో భవిష్యత్ తుఎపుడూ బావుంటుందని  ట్వీట్‌ చేశారు.  మరోవైపు ఈ వ్యాక్సిన్ దేశ చట్టాలకు అనుకూలంగా ఉందని దేశ ఆరోగ్య మంత్రి అబ్దుల్ రెహ్మాన్ అల్-ఓవైస్ ప్రకటించారు.

షేక్ మొహమ్మద్ తనకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నట్లు ట్విటర్‌లో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసారు. రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నా.. ప్రతి ఒక్కరికీ భద్రత, గొప్ప ఆరోగ్యాన్ని  ఇవ్వాలన్ని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.  యుఎఈలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన తమ బృందాలను చూసి గర్వంగా ఉందన్నారు.  కాగా గత కొన్ని వారాలుగా కొంతమంది యుఏఈ మంత్రులు కూడా  కరోనా టీకా షాట్స్‌ తీసుకున్నారు.  ముఖ్యంగా  కోవిడ్-19 రోగులతో సన్నిహితంగా ఉన్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులకు ట్రయల్ వ్యాక్సిన్‌కు సెప్టెంబర్‌లో యుఏఈ అత్యవసర అనుమతి ఇచ్చింది. ఆరోగ్య కార్యకర్తల రక్షణ, భద్రత కోసం దేశం తీసుకున్న చర్యలలో భాగంగా టీకా అత్యవసర వాడకానికి యుఎఈ అనుమతించింది. గత నెల ప్రారంభంలో, దేశ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ట్రయల్ కరోనావైరస్ వ్యాక్సిన్ అందుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు