Viral Video: ఉబర్‌ డ్రైవర్‌ ఔదార్యం! అపరిచిత ‍ప్రయాణికుడి కోసం..

31 Mar, 2023 14:52 IST|Sakshi

మనకు తెలియని వ్యక్తి కనీసం రూ. 10 ఇవ్వాలన్న ఆలోచిస్తాం. అలాంటి ఎవరో తెలియని వ్యక్తికి ఏకంగా ఒక అవయవాన్నే దానం చేయడం అంటే వామ్మో అని పిస్తుంది కదా. ఔను ఇక్కడొక ఉబర్‌ డ్రైవర్‌ అలానే చేశాడు. ఆ వ్యక్తి డ్రైవర్‌కి తెలియదు. తను డ్రాప్‌ చేయాల్సిన​ కస్టమర్‌ మాత్రమే. వివరాల్లోకెళ్తే..యూఎస్‌కి చెందిన బిల్‌ సుమీల్‌ అనే వ్యక్తి డయాలసిస్‌ సెంటర్‌కి వెళ్లాలని ఉబర్‌ బుక్‌ చేసుకున్నాడు. ఇంతలో తనని పికప్‌ చేసుకునేందుకు కారు వచ్చింది. బిల్‌ సుమీల్‌ ఆ కారులో ప్రయాణిస్తూ డ్రైవర్‌ టిమ్‌ లెట్స్‌తో మాటలు కలిపాడు.

తన గురించి, తన అనారోగ్యం గురించి డ్రైవర్‌తో పంచుకున్నాడు. ఆ తర్వాత ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకోగానే.. సదరు ఉబర్‌ డ్రైవర్‌ టిమ్‌ తన కిడ్నిని సుమీల్‌కి దానం చేసేందుకు రెడీ అయ్యాడు. విచిత్రంగా అతడి కిడ్నీ సుమీల్‌కి సూట్‌ అయ్యింది. బహుశా దేవుడు ఇందుకోసమే మిమ్మల్ని నా కారులో వచ్చేలా చేశాడని డ్రైవర్‌ టిమ్‌ సుమీల్‌కి చెప్పాడు కూడా. కిడ్నీ బదిలీ కోసం సుమీల్‌కి ఆపరేషన్‌ చేశారు. అది విజయవంతమయ్యింది. 

ఆ తర్వాత నుంచి ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. అయితే సుమీల్‌ డెలావేర్‌ యూనివర్సిటీ మూత్రపిండ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాడు. ఉబర్‌ డ్రైవర్‌ టిమ్‌  లైట్స్‌ జర్మనీలో నివశిస్తున్నాడు. అయితే ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారని తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అందుకు సంబంధించిన కథనాన్ని ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు ఆ ఉబర్‌ డ్రైవర్‌ ఔదార్యానికి ఫిదా అవుతూ పోస్ట్‌లు పెట్టారు.  

A post shared by Good News Movement (@goodnews_movement)

(చదవండి: విమానంలో అనౌన్సర్‌గా బీజేపీ ఎంపీ..షాక్‌లో ప్రయాణికులు)

మరిన్ని వార్తలు