బ్రిటన్‌ ఎంపీ డేవిడ్‌ అమీస్‌ దారుణ హత్య

16 Oct, 2021 07:48 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ఎంపీ డేవిడ్‌ అమీస్‌ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, డేవిడ్‌ హత్యను బ్రిటన్‌ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. 

చదవండి: (ఆఫ్గానిస్తాన్‌ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య) 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు