Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో..

31 Dec, 2021 20:46 IST|Sakshi

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి ఖరీదైన వస్తువులను ఆర్డర్‌ చేస్తే, వాటి స్థానంలో సబ్బులు, ఇటుక రాళ్లు తెచ్చి చేతుల్లో పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ మోసాలు పరిపాటైపోయాయి. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదులనుభవమే ఎదురైంది. సదరు వ్యక్తి ఆన్‌లైన్‌లో ఐ ఫోన్‌ను ఆర్డర్‌ చేశాడు. ఐతే ఫోన్‌కు బదులుగా 2 వైట్‌ కలర్‌ ఓరియో క్యాడ్‌బరీ చాక్లెట్లు ఆర్డర్‌ ప్యాక్‌లో ఉండటంతో చూసి లబోదిబోమన్నాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన డానియెల్‌ కారోల్‌ దాదాపు రూ. 1,05, 000 లక్షల విలువైన ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ను ఆర్డర్‌ చేశాడు. ఆర్డర్‌ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా డెలివరీ అందింది. దానిని ఓపెన్‌ చేసిన డానియెల్‌ లోపల ఐ ఫోన్‌ లేకపోవడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. దాని స్థానంలో వైట్‌ టాయిలెట్‌ పేపర్‌ రోల్‌తో చుట్టిన 120 గ్రాముల వైట్‌ ఓరియో చాక్లెట్లు ఉన్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో డానియెల్‌ ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. పార్సిల్‌ తాలూకు ఫొటోలు కూడా షేర్‌ చేశాడు. డిసెంబర్‌ 2న యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్లో ఆర్డర్‌ చేశానని, డిసెంబర్‌ 17న డెలివరీ ​అందాల్సి ఉండగా అలా జరగలేదని ట్విటర్‌లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన డీహెచ్‌ఎల్‌ డెలివరీ సర్వీస్‌ను సంప్రదించి రిప్లేస్‌ చేయవల్సిందిగా కోరింది.

చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’

>
మరిన్ని వార్తలు