Viral Video: ఉక్రెయిన్‌కి సునాక్‌ మద్దతు హామీ

20 Nov, 2022 12:40 IST|Sakshi

కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా రిషి సునాక్‌ బ్రిటన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో రష్యా చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్‌కి బ్రిటన్‌ అన్ని విధాలుగా మద్ధతు ఇస్తుందని సునాక్‌ హామీ ఇచ్చారు. జెలెన్‌ స్కీ కీవ్‌ని సందర్శించినందుకు సునాక్‌కి ధన్యావాదాలు తెలిపారు. అంతేగాదు బ్రిటన్‌కి స్వాతంత్య్రం కోసం పోరాడటం అంటే ఏమిటో తెలుసునని సునాక్‌ అన్నారు.

అలాగే ఉక్రెయిన్‌ కోసం పోరాడుతున్న పరాక్రమ యోధులకు సాయం అందిస్తామని వాగ్ధానం చేశారు.  పైగా ఉక్రెయిన్‌ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఔషధాలు, అందుబాటులో ఉండేలా బ్రిటన్‌ మానవతా సహాయాన్ని అందిచడం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ మేరకు జెలెన్‌స్కీ ట్విట్టర్‌లో..."ఇరు దేశాలకు స్వాతంత్యం కోసం నిలబడటం తెలుసు. బ్రిటన్‌ లాంటి స్నేహితులు పక్కన ఉంటే విజయం సాధించడం తధ్యం" అని ధీమగా చెప్పారు.

ఇదిలా ఉండగా..సునాక్‌ ఆగస్టులో ఉక్రెయిన్‌కి స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో రష్యా దూకుడుకి ఎదురు నిలబడి అజేయమైన ధైర్యసాహాసాలో పోరాడుతున్నందుకు ఉక్రెయిన్‌ని ప్రశంసలతో ముంచెత్తారు సునాక్‌. నిరంకుశత్వానికి పరాకాష్టగా పోరాటం సాగిస్తున్న వారెవ్వరూ విజయం సాధించలేరంటూ ఒక చక్కటి సందేశాన్ని పంపారు సునాక్‌. 

(చదవండి: వందేళ్ల వయసులోనూ విరామమెరుగని వృద్ధ డాక్టర్‌)

మరిన్ని వార్తలు