Rishi Sunak First Speech: ఉక్రెయిన్‌ యుద్ధంపై స్పందించిన బ్రిటన్‌ కొత్త ప్రధాని

25 Oct, 2022 18:08 IST|Sakshi

బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్‌.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామంపై స్పందించారు. లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌లోని అధికారిక భవనం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ వద్ద తన తొలి ప్రసంగంలోనే ఆయన ఈ కీలక అంశంపై మాట్లాడారు. 
 
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు దిశగా సాయం చేస్తామని రిషి సునాక్‌ 10 Downing Street వద్ద తొలి ప్రసంగంలో ప్రకటించారు. ఇదొక భయంకరమైన యుద్ధం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావం చూపెట్టింది. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపెడుతోంది. దాని ముగింపును విజయవంతంగా చూడాలి అని ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. 

అంతకు ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ, కొత్త ప్రధాని రిషి సునాక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉక్రెయిన్‌తో సైన్యసహకారాలు కొనసాగిస్తున్న యూకేతో బంధం మరింత బలపడేందుకు యత్నిస్తామని జెలెన్‌స్కీ ప్రకటించారు. 

ఇక తన ప్రభుత్వం ముందు ఆర్థికంగా పెను సవాళ్లే ఉన్నాయన్న యూకే ప్రధాని రిషి సునాక్‌.. వాటిని ఎలాగైనా అధిగమించి తీరతామని ప్రకటించారు. ఆర్థికంగా బ్రిటన్‌ బలహీనంగా ఉందని.. కానీ, రాబోయే తరాల మీద అప్పుల ప్రభావం లేకుండా చూస్తామని ప్రకటించారు. అలాగే మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ గొప్ప వ్యక్తి అని, ఆమె పాలనలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్దేందుకే తనకు బాధ్యత అప్పజెప్పారని డౌనింగ్‌ స్ట్రీట్‌ బయట వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు