బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు!

20 Oct, 2022 05:00 IST|Sakshi

లండన్‌: నేరాల కట్టడికి ప్రపంచమంతటా పోలీసులు గాలితో పందెం వేస్తూ దూసుకెళ్లే అత్యాధునిక వాహనాలను వాడుతున్నారు. కానీ బ్రిటన్‌ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా టుక్‌టుక్‌ (ఈ–రిక్షా)లను రంగంలోకి దించుతోంది. వేల్స్‌లోని గ్వెంట్‌ కౌంటీ పోలీసులు ఇప్పటికే నాలుగు టుక్‌టుక్‌లు కొనుగోలు చేశారు. స్థానిక న్యూపోర్ట్, అబెర్‌గ్రావెనీ ప్రాంతాల్లో ర్రాతి వేళల్లో పార్కులు, వాక్‌వేలు, బహిరంగ స్థలాల్లో గస్తీకి వాటిని వాడుతున్నారు.

నేరాలు జరిగితే సమీపంలోని ఏ టుక్‌టుక్‌నైనా సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. వీటిపై ప్రజల నుంచి విపరీతమైన సానుకూల స్పందన వస్తోందట! అయితే ఈ టుక్‌టుక్‌ల గరిష్ట వేగాన్ని గంటలకు 55 కిలోమీటర్లకు పరిమితం చేయడం మరో విశేషం. ఈ–రిక్షాల సేకరణకు మహీంద్రా ఎలక్ట్రిక్‌తో గ్వెంట్‌ పోలీసు విభాగం భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు