Discusses Amazon Tax Record: జీ7 పన్నుల ఒప్పందం అమలుతో పురోగతి సాధించగలం: బోరిస్ జాన్సన్

21 Sep, 2021 13:08 IST|Sakshi

పన్నుల విషయం పై చర్చించిన బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ అమెజన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ అమెజాన్‌ స్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ని కలిసి పన్నుల సమస్య పై చర్చించారని న్యూయార్క్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ మేరకు జీ7 పన్నుల ఒప్పందం పూర్తి స్థాయిలో అమలైతే పురోగతి సాధించగలమని జాన్సన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో బెజోస్‌  వాతావరణ పురోగతి, పరిరక్షణలకై దృష్టి సారించటం కోసం $1  బిలియన్‌ డాలర్లు అందజేస్తానని వాగ్దానం చేశారు. 

(చదవండి:  స్పెయిన్‌లో అగ్నిపర్వతం విస్పోటనం)

ఈ మేరకు గతంలో వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, లాభప్రేక్షలేని సంస్థల కోసం $10 బిలియన్ల ఎర్త్‌ ఫండ్‌ని ఫ్రారంభించిన సంగతి తెలిసిందే.దీంతో బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ పర్యావరణ పరిరక్షణ పట్ల బెజోస్‌ కనబరుస్తున్న నిబద్ధతను స్వాగతిస్తున్నాని అన్నారు. కాప్‌ 26 కోసం బ్రిటన్‌ ప్రధానితో కలిసి పనిచేయడానికి బెజోస్‌ అంగీకరించినట్లు న్యూయార్క్‌ డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

(చదవండి: స్పేస్‌ఎక్స్‌ టూరిజంలా త్వరలో మూన్‌ టూరిజం)

మరిన్ని వార్తలు