Covid alarm: శరీరంలో వైరస్‌ ఉంటే మోత మోగుడే!

14 Jun, 2021 16:07 IST|Sakshi

లండన్‌: కరోనా సోకిందా లేదా కనుగొనే పద్ధతిని మరింత వేగవంతం చేయడానికి ఓ పరికరాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు. దీని సాయంతో కరోనా సోకిన వ్యక్తిని అక్కడికక్కడే మనం కనిపెట్టగలమని చెప్తున్నారు. ఈ పరికరం కారణంగా వైరస్‌ వ్యాప్తిని కూడా అడ్డుకోవచ్చని బ్రిటన్‌ వైద్యుల అంటున్నారు.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్), డర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు ప్రత్యేకమైన వాసన ఉందని, వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌లో మార్పుల వల్ల కరోనా రోగి నుంచి ఓ రకమైన వాసన వస్తుందని ఇప్పటికే తేల్చారు. దీని బట్టి ఈ పరికరానికి రోగి శరీరం నుంచి వచ్చే వాసన ఆధారంగా కోవిడ్‌ను నిర్ధారిస్తుందని వెల్లడించారు. ఈ పరికరానికి ‘కోవిడ్‌ అలారం’ అని పేరు పెట్టారు.

డర్హామ్ విశ్వవిద్యాలయంతో ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్, బయోటెక్ కంపెనీ రోబో సైంటిఫిక్ లిమిటెడ్ పరిశోధకుల నేతృత్వంలో.. ఆర్గానిక్‌ సెమీ కండక్టింగ్‌ సెన్సార్లతో ఈ పరికరాన్ని తయారు చేశారు. ‘ఈ అలారం ఫలితాలు నిజంగా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే మరింత ఖచ్చితమైన ఫలితాల కోసం ఈ పరికరానికి మరిన్ని పరీక్షలు అవసరమని’ ఎల్‌ఎస్‌హెచ్‌టిఎమ్‌లోని వ్యాధి నియంత్రణ విభాగం ప్రొఫెసర్ జేమ్స్ లోగాన్ అన్నారు. 

చదవండి: రక్తం గడ్డ కట్టి వ్యక్తి మృతి, ఆ దేశంలో ఆస్ట్రాజెనెకా టీకా నిలిపివేత!

>
మరిన్ని వార్తలు