Afghanistan: బ్రిటన్ ప్రధాని సంచలన ప్రకటన

21 Aug, 2021 20:58 IST|Sakshi

తాలిబన్లతో కలిసి పనిచేయడానికి సిద్ధం 

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ సంచలన ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో కలిసి పనిచేయటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. తాలిబన్లతో కలసి పనిచేసే అవకాశం ఉందని బ్రిటన్ ప్రధాని ప్రకటించారు. 

ప్రస్తుతం అఫ్గాన్‌ సంక్షోభం పరిష్కారంకోసం దౌత్య ప్రయత్నాలు చేస్తున్నామని, పరిస్థితులను చక్కబెట్టటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో కలిసి చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. తద్వారా అఫ్గాన్‌ పౌరులకు భరోసా  ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.కొన్ని సమస్యల వల్లే బ్రిటన్ పౌరులను స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. కాగా తాలిబన్లతో కలిసి పని చేయటానికి తమకు అభ్యంతరం లేదని తొలుత చైనా ప్రకటించింది. ఆ తరువాత ఇదే బాటలో పాకిస్తాన్‌, రష్యా దేశాలు తాలిబన్లకు మద్ధతు పలికిన సంగతి తెలిసిందే.

చదవండి :  తాలిబన్ల చెరలో అఫ్గన్‌: హృదయ విదారక దృశ్యాలు.. వైరల్‌

Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!

మరిన్ని వార్తలు