షాకింగ్‌: మాస్క్‌ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు

7 Jun, 2021 21:03 IST|Sakshi
ఉమ్మేసి పరుగెడుతున్న మహిళ..

లండన్‌: మహమ్మారి వైరస్‌ రాకుండా ముందస్తుగా ప్రపంచం మొత్తం మాస్క్‌ ధరిస్తున్నారు. కొందరు మాస్క్‌ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇప్పుడు ప్రతిచోట ‘మాస్క్‌ ధరిస్తేనే అనుమతి’ అనే బోర్డులు విధించారు. మాస్క్‌ లేని వారిని అనుమతించడం లేదు. అయితే ఒక షాపింగ్‌మాల్‌ వద్ద మాస్క్‌ లేకుండా వచ్చిన మహిళ బీభత్సం సృష్టించింది. మాస్క్‌ లేదని అడిగిన సెక్యూరిటీ గార్డుపై ఉమ్మేసి పరుగులు పెట్టిన ఘటన వైరల్‌గా మారింది. ఈ సంఘటన యూకేలోని లండన్‌లో జరిగింది.

లండన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు ఇద్దరు మహిళలు వచ్చారు. అయితే వారు మాస్క్‌ ధరించకపోవడంతో వారిని సెక్యూరిటీ గార్డు నిలువరించాడు. మాస్క్‌ ధరించి రావాలని సూచించాడు. దీంతో ఆ మహిళలు సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగారు. ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. లోపలకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అతడిని దుర్భాషలాడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

అయితే ఆ ఇద్దరిలోని ఓ మహిళ దూరంగా వచ్చినట్టు చేసి వెంటనే సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి ముఖంపై ఉమ్మేసి పరుగులు పెట్టింది. షాక్‌కు గురయిన సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను పట్టుకునేందుకు ఉరుకులు పెట్టారు. చివరకు ఆమె చిక్కింది. ఆమెపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్క్‌ ధరించడం వదిలేసి తనకు తానే ఆమె ఇబ్బందులను కొని తెచ్చుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోనిదే కాక సెక్యూరిటీ గార్డుపై ఉల్టా దాడి చేసుడు ఏందమ్మా? అని  ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు