రష్యా బలగాలకు బిగ్‌ షాక్‌.. వీడియో వైరల్‌

3 Apr, 2022 07:19 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. 

తాజాగా ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్‌ మిసైల్‌ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్‌ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ కూల్చేసింది. మిసైల్‌ ఢీకొట్టడంతో హెలికాప్టర్‌ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్‌గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్‌ గైడెడ్‌ మిసైల్‌ సిస్టమ్‌ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్‌ ప్రయోగంపై రష్యా మండిపడింది. 

ఇకపై ఇంగ్లండ్‌ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా కనీసం 143 యుద్ధవిమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులు, 316 సైనిక వాహనాలను కోల్పోయినట్టు సమాచారం. ఇప్పటిదాకా 18 వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ఉక్రెయిన్‌ చెప్తోంది. 

మరిన్ని వార్తలు