తక్కువ అంచనా వేశారు.. రష్యన్‌ బోట్లను పేల్చేశాం: ఉక్రెయిన్‌

2 May, 2022 17:01 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్‌ మొదలుపెట్టి రెండు నెలలు దాటిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు పడుతోంది తెలియట్లేదు. రష్యా యుధ్దం అయితే మొదలుపెట్టింది గానీ దీన్ని ముగించేలోపు కోట్లలో ఆస్తులు నష్టం, లక్షల్లో నిరాశ్రయులు కాగా వేల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా న‌ల్ల స‌ముద్రంలోని స్నేక్ ఐలాండ్ వ‌ద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండు రష్యా రాఫ్టర్‌ పడవలను ఉక్రెయిన్ పేల్చివేసింది.

వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున స్నేక్ ఐలాండ్ వ‌ద్ద రెండు ర‌ప్తార్ బోట్ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు ఉక్రెయిన్ ర‌క్షణ శాఖ తెలిపింది. ఈ బోట్ల పేల్చివేత‌కు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫూటేజ్‌ను సోషల్‌ మీడియాలో విడుదల రిలీజ్ చేసింది. అనంతరం ఈ ఘటనపై మాట్లాడుతూ.. ట‌ర్కీకి చెందిన బైర‌క్తార్ డ్రోన్ల‌తో ఈ దాడి జ‌రిగింద‌ని, అవి బాగానే ప‌నిచేస్తున్నాయని ఉక్రెయిన్ సైనిక ద‌ళాల క‌మాండ‌ర్ తెలిపారు. ర‌ఫ్టార్‌ పెట్రోలింగ్ బోట్ల‌లో ముగ్గురు సిబ్బంది ఉంటారు.

మ‌రో 20 మంది వరకు అవి తీసుకువెళ్ల సామర్థ్యం ఉంటుంది. వాటిలో మెషిన్ గ‌న్స్ ఉంటాయి. ల్యాండింగ్ ఆప‌రేష‌న్స్ కోసం వీటిని ఎక్కువ‌గా వాడుతుంటారు. స్నేక్ ఐలాండ్ వ‌ద్ద ఉక్రెయిన్ ద‌ళాలు ర‌ష్యాను తీవ్రంగా ప్ర‌తిఘ‌టించాయి. కాగా ఇటీవలే న‌ల్ల‌స‌ముద్రంలో పార్కింగ్ చేసిన మాస్క్‌వా యుద్ధ నౌక‌ను కూడా పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

చదవండి: తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్‌ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?

మరిన్ని వార్తలు