Ukraine Military: తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్‌ సేన.. రష్యా బలగాలకు పట్టపగలే చుక్కలు..

26 Feb, 2022 14:45 IST|Sakshi

Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు, ఆ దేశ సైనికులకు మధ్య భీకర పోరు నడుస్తోంది. ఎంతో ఆయుధ సంపత్తి ఉండి అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్‌ కలిగిన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడి భారీ నష్టాన్నే మిగిల్చినట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా జరుగున్న యుద్దంలో ఉక్రెయిన్‌ సైన్యం తగ్గేదేలే అంటూ తమ సామర్థ్యానికి మించి పోరాడుతోంది. ర‌ష్యా ద‌ళాల‌ను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్న‌ట్లు ప‌శ్చిమ దేశాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3500 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ త‌న ఫేస్‌బుక్ పేజీలో తాజాగా పేర్కొంది. అంతేకాకుండా మ‌రో 200 మంది ర‌ష్యా సైనికులను తాము అరెస్టు చేసిన‌ట్లు కూడా గర్వంగా వెల్లడించారు. ఈ క్రమంలో తమ దేశ సైనికులు రష్యాకు చెందిన 14 విమానాల‌ను, 8 హెలికాప్ట‌ర్ల‌ను, 102 యుద్ధ ట్యాంక్‌ల‌ను, 536 ఆర్మీ వాహనాలను నాశనం చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. 

కాగా, సైనికుల మృతులకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రష్యా ఇప్పటి వరకు వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు కీవ్‌ నగరం వద్ద రష్యా బలగాలకు, ఉక్రెయిన్‌ సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాల మేరకు ఆ దేశ బలగాలు మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు