వైరల్ వీడియో.. రష్యా క్షిపణులను పేల్చేసిన ఉక్రెయిన్‌

17 Nov, 2022 20:39 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుసగా ఎదురదెబ్బలు తింటున్న పుతిన్ దేశం.. మరోమారు ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. బాంబుల వర్షం కురిపిస్తూ హడలెత్తించింది. ఉక్రెయిన్‌లో శీతాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు పడిపోయిన తరుణంలో విద్యుత్ మౌలికసదుపాయాలే లక్ష‍్యంగా భీకరదాడులు చేసింది.

‍అయితే రష్యా క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. క్రెమ్లిన్‌కు చెందిన క్రూజ్ మిసైల్స్‌ను నిర్వీర్యం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలోకి రెండు రష్యా క్షిపణలు దూసుకువచ్చాయి. వీటిని పసిగట్టిన ఉక్రెయిన్ సేనలు తమ మిసైల్స్‌ను ఉపయోగించి రష్యా క్షిపణులను పేల్చివేశాయి. ఈ దృశ్యాలను ప్రత్యక్ష సాక్షి తన ఫోన్‌లో వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది.

చదవండి: అమెరికా అధ్యక్ష బరిలో బరాక్‌ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్‌

మరిన్ని వార్తలు