ఉక్రెయిన్ విమానం హైజాక్

24 Aug, 2021 13:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కీవ్: ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌కు గురయ్యింది. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ప్రభుత్వం అఫ్గనిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్‌ చేసి ఇరాన్‌కు మళ్లించారు. విమానం హైజాక్‌ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. విమానాన్ని హైజాక్‌ చేసింది ఎవరు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. 

ఈ విమానం గతవారం అఫ్గనిస్తాన్‌ వచ్చినట్లు ఉక్రెయిన్‌ విదేశాంగ కార్యదర్శి తెలిపారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఆదివారం మా విమానం కాబూల్‌ హైజాక్‌కు గురయ్యింది. మంగళవారం, విమానం ఆచరణాత్మకంగా మా నుంచి దొంగిలించబడింది. ఇక విమానంలో ఉక్రెయిన్లకు బదులుగా గుర్తు తెలియని ప్రయాణీకులు ఉన్నారు.  83 మంది ప్రయాణికుల బృందంతో విమానం ఇరాన్‌కు వెళ్లింది. మా తదుపరి మూడు తరలింపు ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. ఎందుకంటే మా ప్రజలు విమానాశ్రయంలోకి ప్రవేశించలేకపోయారు" అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్‌తో పేర్కొన్నారు.

విమానం హైజాక్ వార్తలను ఇరాన్‌ ఖండించింది. కాబూల్‌ నుంచి విమానం వచ్చింది, రీఫ్యూయల్‌ చేసుకుని వెళ్లింది. ప్రస్తుతం మా భూభాగంలో ఉక్రెయిన్ విమానం లేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు