కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

20 Feb, 2022 21:11 IST|Sakshi

Ukraine president Volodymyr Zelenskiy: ఉక్రెయిన్‌ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్‌ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్‌ఈ)లతో పాటు ఉక్రెయిన్‌ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

(చదవండి: ఉక్రెయిన్‌ వీడి భారత్‌కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు