'ధైర్యంగా ఉండండి': గాయపడిన సైనికులకు జెలెన్‌స్కీ పరామర్శ

19 Sep, 2023 10:47 IST|Sakshi

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించడానికి న్యూయార్క్‌ వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ యుద్ధంలో గాయపడి న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉక్రెయిన్ సైనికులను పరామర్శించారు. ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడిన అయన వారిని ధైర్యంగా ఉండమై చెబుతూనే రష్యా నాయకులను తీవ్రవాదులుగా సంబోధించారు.   

ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎందరో ఉక్రెయిన్ సైనికులు చనిపోగా మరెందరో సైనికులు గాయపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక గత నెల ప్రచురించిన కథనంలో ప్రకారం ఉక్రెయిన్ సైనికుల్లో చనిపోయిన వారు గాయపడిన వారు మొత్తం కలిపి ఐదు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది. 

యూఎన్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించేందుకు, యుద్ధంలో తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరింత అమెరికా సాయ కోరడానికి ఇక్కడికి విచ్చేసిన జెలెన్‌స్కీ నేరుగా యుద్ధంలో గాయపడిన సైనికులు చికిత్స పొందుతున్న స్టాటిన్ ఐలాండ్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆయన వచ్చేసరికి కృత్రిమ కాళ్లు అమర్చిన సైనికులు నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. మిగిలిన సైనికుల్లో అత్యధికులు వీల్ ఛైర్‌లలో ఉండగా కొంతమంది కృత్రిమ చేతులు అమర్చి ఉన్నారు. 

ఈ సందర్బంగా సైనికులతో మాట్లాడుతూ.. తొందరగా ఇంటికి చేరుకోవాలన్న దృఢ సంకల్పం ఉన్న సైనికులను నేనెప్పుడూ చూడలేదు. మీకోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. మీ అవసరం మాకు చాలా ఉంది. మీ సంకల్పం చాలా గొప్పది. మీరంతా తొందరగా కోలుకుని తిరిగి ఉక్రెయిన్ రావాలని మన శత్రువుపై గెలుపులో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా అన్నారు. చివరిగా సైనికులకు ధైర్యంగా ఉండమని చెప్పారు. అనంతరం సైనికులతోపాటు అక్కడ హాస్పిటల్ స్టాఫ్ కు ఉక్రెయిన్ గౌరవ అవార్డులిచ్చి సత్కరించి వారితో ఫోటోలు కూడా తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: భారత్‌పై సంచలన ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని 

మరిన్ని వార్తలు