శ్మశాన నిశ్శబ్దంలో ఉక్రెయిన్‌ నగరాలు! మౌనం వల్లే మృత్యుఘోష అంటూ పాటతో..

4 Apr, 2022 08:31 IST|Sakshi

Ukraine Tribute At Grammy: సంగీతం అంటే శబ్దం.. పరవశం కలిగించేంది.. ప్రతీ ఒక్కరినీ కదిలించగలిగే శక్తి ఉంది దానికి. మరి దాని వ్యతిరేకం.. నిశబ్దం. ఆ నిశబ్దమే ఇప్పుడు ఉక్రెయిన్‌ నగరాల్లో రాజ్యమేలుతోంది. శవాల దిబ్బలతో శ్మశానాలను తలపిస్తున్నాయి అక్కడి నగరాలు. అందుకే సంగీతంతో ఆ మృత్యుఘోషను ప్రపంచానికి వినిపించడని వేడుకుంటున్నాడు జెలెన్‌స్కీ.  

గ్రామీ అవార్డులు 2022 కార్యక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఉద్వేగపూరిత ప్రసంగం చేశాడు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 5గం.30ని. ప్రారంభమైన Grammy Awards 2022 వేదికలో ప్రసంగించాడు జెలెన్‌స్కీ. మౌనం వల్లే ఉక్రెయిన్‌ నాశనం అవుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వీలైన రీతిలో ఉక్రెయిన్‌ పౌరులకు మద్ధతు ప్రకటించాలంటూ గ్రామీ అవార్డుల వేదికగా విజ్ఞప్తి చేశాడు జెలెన్‌స్కీ. నిశబ్దాన్ని మీ సంగీతంతో పూరించండి. అదీ ఇవాళే. మా కథను ప్రపంచానికి చెప్పండి.

వీలైన రీతిలో మాకు మద్ధతు ప్రకటించండి. కానీ.. మౌనంగా మాత్రం ఉండకండి’ అంటూ ప్రసంగించాడు జెలెన్‌స్కీ. అటుపై ఉక్రెయిన్‌ కవి ల్యూబా యకించుక్‌, అమెరికన్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌లు ఉక్రెయిన్‌ పరిణామాలపై పర్‌ఫార్మెన్స్‌ చేశారు. 

64వ గ్రామీ అవార్డుల వేడుక లాస్‌ వెగాస్‌లో అట్టహాసంగా జరిగింది. జనవరిలో జరగాల్సిన ఈ వేడుక కరోనా కారణంగా వాయిదా పండి. దాదాపు 45కు పైగా కేటగిరీల్లో అవార్డులను ఇచ్చారు. వరుసగా రెండో ఏడాది ట్రెవర్‌ నోహా హోస్టింగ్‌ చేశారు. సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా.. లీవ్‌ ది డోర్‌ ఓపెన్‌ Leave the door open గ్రామీ అవార్డు దక్కించుకుంది. ఈ సాంగ్‌కు గానూ..  బ్రాండన్‌ ఆండర్‌సన్‌, క్రిస్టోఫర్‌ బ్రాడీ బ్రౌన్‌, డెర్నెస్ట్‌ నెమిలీ 2, బ్రూనో మార్స్‌లు అవార్డు అందుకున్నారు. భారత్‌ తరపున హాజరైన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌..  సెల్ఫీలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు