ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా

15 Nov, 2022 23:10 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్‌పై మంగళవారం మిసైల్స్‌ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

‘100కుపైగా మిసైల్స్‌ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్‌ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్‌ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్‌ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉ‍క్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రతినిధి యూరీ ఇగ్నాత్‌.

ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్‌ హ్యండ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి!

మరిన్ని వార్తలు