Ukraine-Russia War: అమ్మా భయమేస్తోంది.. బంకర్‌లో బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు

25 Feb, 2022 12:22 IST|Sakshi

కీవ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి అక్కడి నుంచి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనమే లక్ష్యంగా రష్యా బలగాలు బాంబుల వర్షంతో ఆ నగరాన్ని అల్లాడిస్తోంది. ఇదిలా ఉండగా మరో వైపు వేలాది మంది భారతీయలు, ప్రత్యేకించి విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది.

ముందస్తు హెచ్చరికలు ప్రభుత్వాలు జారీ చేసినప్పటికీ సమస్య యుద్ధం వరకు వెళ్లదని అంతా భావించారు. కానీ పుతిన్‌ ప్రకటనతో తాజాగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో విద్యార్ధులు బిక్కుబిక్కుమంటూ ఎటూ పోవాలో తెలియక చిక్కుకుపోయారు.  సుమారు 18 వేల మంది భారతీయులు అందులో అధికంగా విద్యార్ధులు ఉన్నారు. ప్రస్తుతం చేతులో సరిపడా డబ్బులు లేక అరకొర ఆహారం తీసుకుంటూ ఎటువెళ్లాలో తెలియని  
స్థితిలో వారు గడుపుతున్నారు. 


►రష్యా సరిహద్దకు 30 కి.మి దూరంలో ఉన్న కార్‌కీవ్‌ నగరంలో బాంబుల మోతతో మోగిపోతోంది. బాంబుల ధాటికీ పలు భవనాలు కూలుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధులు ఆరు బయటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. కనీసం నిత్యావసరాలు కూడా నిల్వ చేసుకోకపోవడంతో వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 

మరిన్ని వార్తలు