పుతిన్‌ ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌...71 వేల మంది రష్యా సైనికులు మృతి

1 Nov, 2022 15:41 IST|Sakshi

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులోనే దాదాపు వెయ్యిమంది రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఫిబ్రవరిలో దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే దాదాపు 71, 200 మందికి పైగా రష్యా బలగాలు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ సాయుధ దళాల జనరల్‌ స్టాఫ్‌ పేర్కొంది. అదీగాక కేవలం ఒక్క ఆదివారం నాడే సుమారు 950 మంది నెలకొరిగారని వెల్లడించింది. ఉక్రెయిన్‌ దళాలు కీలకమైన దక్షిణ నగరంలోని ఖైర్సన్‌ వైపుగా ముందుకు సాగుతున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లొదిమిర్‌ జెలెన్‌ స్కీ వెల్లడించారు.

అదీగాక ఇటీవల పెద్ద సంఖ్యలో సైనిక మొబైలైజేషన్ చేసింది. కానీ ఆ బలగాలు మాస్కో పంపిన రిజర్వ్‌స్ట్‌ పరికరాలతో సమస్యలను ఎదుర్కొనడమే గాక పోరాడే సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యూకే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల పెద్ద సంఖ్యలో రిక్రూట్‌ చేసుకున్న సైనికులు చాలా పేలవంగా పోరాడుతున్నట్లు కూడా వెల్లడించింది. మరికొంత మంది రిజర్వ్‌ బలగాలు ఆయుధాలు లేకుండా మోహరించడం వంటివి  చేస్తున్నారంటూ స్వయంగా రష్యా అధికారులే తలలు పట్టుకుంటున్నట్లు పేర్కొంది.

అదీగాక మాస్కో బలగాలు 1959 నాటి ఏకేఎం రైఫిల్స్‌ వాడుతున్నట్లు తెలిపింది. పేలవమైన నిల్వ ఆయుధాల కారణంగానే వేలాదిమంది సైనికులు యుద్ధంలో పోరాడ లేక నెలకొరుగుతున్నట్లు యూకే రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ రష్యా తన దూకుడును తగ్గించకపోగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ప్రాంతంలో పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మాస్కో దాడులు కొనసాగిస్తుండటం గమనార్హం. 

(చదవండి: రష్యా సైన్యంలోకి అఫ్గాన్‌ కమాండోలు)

మరిన్ని వార్తలు