Russia Ukraine War: మాట తప్పిన రష్యా.. జనావాసాలపై క్షిపణి దాడి

26 Feb, 2022 17:08 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా బలగాల మిస్సైల్స్‌ దాడి కొనసాగుతోంది. ఉక్రెయన్‌ రాజధాని నగరంలో కీవ్‌లోని ఓ భారీ అపార్ట్‌మెంట్‌పై రష్యా మిస్సైల్‌ దాడి చేసింది. ఈ దాడిలో సుమారు ఐదు ఫ్లోర్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అపార్ట్‌మెంట్‌ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎమర్జెన్సీ సర్వీసెస్‌ తెలిపాయి. బాధితుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వీడియో షోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి నుంచి ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలే తమ టార్గెట్‌ అంటూ చెప్పుకొస్తున్న రష్యా.. జనావాసాల మీద కూడా బాంబులతో విరుచుకుపడుతోంది.

రాజధాని నగరం కీవ్‌లోని ఓ భారీ భవనంపై రష్యా సైన్యం క్షిపణి ప్రయోగించిందని కీవ్‌ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపారు. రాత్రి పూట రష్యా దళాలు.. దాడులకు దిగడంతో కీవ్‌లో భయనక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కీవ్‌లోకి ప్రవేశించడానికి రష్యా సైన్యం అన్ని దిశలను నుంచి దాడులు చేస్తూ వస్తోందన్నారు.  

దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ ఫొటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. శాంతియుతమైన కీవ్‌ నగరం.. రష్యా బలగాలు క్షిపణుల దాడులతో అట్టుడుకుతోందని అన్నారు. రష్యా ప్రయోగించిన మిస్సైల్‌ ఒకటి కీవ్‌లోని అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టిందని తెలిపారు. అంతర్జాతీయ సమాజం రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధించాలని ఆయన కోరారు.

>
మరిన్ని వార్తలు