Russia Ukraine War: ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?

25 Feb, 2022 15:27 IST|Sakshi

Ukrainian Woman Confronts Russian Soldiers: రష్యా దళాలు గురువారం ఉక్రెయిన్ సరిహద్దును దాటి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి ఇప్పుడు రాజధాని కైవ్‌కు సమీపంలో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి వీధుల్లోకి ప్రవేశించడంతో ఉక్రెనియన్లు రష్యా దాడిని ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృత నిరసనలు చేపట్టారు. టోక్యో నుంచి న్యూయార్క్‌ వరకు రష్యా కార్యాలయలు వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు సైతం సైనిక దుస్తులతో యుద్థ రంగంలోకి వెళ్లి తమ సైనికులకు ధైర్యాన్ని నింపడమే కాక తాను సైతం రష్యా బలగాలతో తలపడుతున్నాడు.

ఇంకో వైపు ఆ దేశపు మహిళలు సైతం తాము కూడా తమ దేశం కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటున్నారు. ఈ మేరకు రాజధానికి సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్‌లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్‌ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం బెరుకు లేకుండా మా దేశంలో ఏం చేస్తున్నారంటూ నిలదీసింది.  తుపాకులు, పెద్ద మెషిన్‌ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోసించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ..ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే  ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది.

దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి  అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన  తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది.

పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సైనికులను చూసి ఏ మాత్రం భయపడకుండా నిలబడిన "నిర్భయ", ఆమెను తమ దేశ దళాలతో మాట్లాడమని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ బలగాలను ధైర్యంగా పోరాడేలా చేయగల సమర్థురాలు అని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!)

మరిన్ని వార్తలు