Russia Ukraine War: రష్యా సైనికుల భార్యలే ‘రేప్‌ చేయమ’ని ప్రోత్సహిస్తున్నారు: జెలెన్‌స్కీ భార్య

30 Nov, 2022 14:56 IST|Sakshi

లండన్‌: ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ, అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ భార్య ఒలెనా జెలెన్‌స్కీ.. రష్యా సైనిక కుటుంబాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దళాలు లైంగిక వేధింపులనే ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ ఒలెనా ఆక్రోశించారు. సంఘర్షణ సమయంలో జరుతుగున్న లైంగిక వేధింపులను పరిష్కరించడం కోసం లండన్‌లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో ఒలెనా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో రష్యా సైనికుల భార్యలే.. ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాలకు తెగబడమని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచి రష్యా బలగాలు ఇలా బహిరంగంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. యుద్ధ సమయంలో లైంగిక వేధింపులనేవి అత్యంత హేయమైన, క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలా మృగంలా పాశవికంగా ప్రవర్తించి తమ గొప్పతనాన్ని చాటుకోవడం అమానుషం అని రష్యా దళాలపై ఒలెనా విరుచుకుపడ్డారు.

యుద్ధ సమయంలో ఎవరూ సురక్షితంగా ఉండే అవకాశం ఉండదని, ఇదే అదనుగా చేసుకుని మహిళలపై ఇలాంటి దుశ్చర్యలకు పూనుకోవడం అనేది అనైతికం అన్నారు.అంతేగాదు రష్యా బలగాలు దీన్ని ఒక అతిపెద్ద ఆయుధంగా, తమ ఇష్టరాజ్యంగా ఉపయోగిస్తున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా స్పందన రావాలన్నారు. దీన్ని యుద్ధ నేరంగా గుర్తించి, నేరస్తులందర్నీ జవాబుదారీగా చేయడం అత్యంత ముఖ్యం అని ఒలెనా అన్నారు. 

(చదవండి: యుద్ధ సమయంలో ఆఫ్రికన్‌ దేశాలకు ఉక్రెయిన్‌ చేయూత)

మరిన్ని వార్తలు