రష్యా పై నోరు పారేసుకోవడమే తప్ప ఉక్రెయిన్‌కి చేసిందేమీ లేదు! ఉక్రెయిన్‌ ఎంపీ

27 Mar, 2022 15:47 IST|Sakshi

As Ukrainian feel reassured: యూరప్‌ పర్యటనలో భాగంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌ పోలాండ్‌ పర్యటన చేసిన సంగతి తెలిసింది. ఈ మేరకు బైడెన్‌ పోలాండ్‌లోని ఉక్రెనియన్‌ అగ్ర నేతలతో భేటి అ‍య్యారు. ఆ సమావేశంలో ప్రస్తుతం ఉక్రెయిన్‌ రష్యా మధ్య సాగుతున్న యుద్ధం, తాజా పరిస్థితులపై బైడెన్‌ చర్చించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఎంపీ ఇన్నా సోవ్‌సన్‌ జోబైడెన్‌ చేసిన ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఒక ఉక్రెనియన్‌గా భరోసా కలిగించే ఒక్కమాట కూడా జోబైడెన్‌ నుంచి తాను వినలేదని అన్నారు.

ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో యూరోపియన్‌ దేశానికి సహాయం చేయడానికి అమెరికా తగినంతగా ఏమి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం మాకు పశ్చమ దేశాలే ఎక్కువ సహాయం చేస్తున్నయని అన్నారు. కానీ ఈ ప్రసంగంలో బైడెన్‌ పోలాండ్‌కి మద్దతుగా మాట్లాడినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఉక్రెయిన్‌ ఎంపీ సోవ్‌సన్‌. అయినా దాడులు జరుగుతోంది కైవ్‌లోనూ, ఖార్కివ్‌లోనూ,.. వార్సాలో కాదంటూ ఘాటుగా కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ ఎంపీ ట్విట్టర్ వేదికగా జో బైడెన్‌ ప్రంసంగం పై విరుచుకుపడ్డాఈరు.

ఇదిలా ఉండగా..ఆ ప్రసంగంలో బైడెన్‌ రష్యాన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను పరమ కసాయిగా పేర్కొన్నారు. అంతేకాదు అతను ఎక్కువ కాలం అధ్యక్షుడిగా సాగలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా పై ఉక్రెయిన్ సాగిస్తున్న ప్రతి ఘటనను సోవియట్‌కి  వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా అభివర్ణించారు. గతంలో రష్యా ఉక్రెయిన్‌ వివాదంపై బైడెన్‌ నాటో, జీ7 సమావేశల్లో పాల్గొన నాట భూభాగంలో ఒక్క అంగుళం మీదకు వెళ్లడం గురించి ఏ మాత్రం ఆలోచనే చేయోద్దు అని రష్యాను హెచ్చరించారు కూడా.

(చదవండి: పుతిన్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు.. రష్యా సూపర్‌ కౌంటర్‌)

మరిన్ని వార్తలు