ఉక్రెయిన్‌ దళంలో చేరిన ఒలింపిక్‌ షూటర్‌

15 May, 2022 21:00 IST|Sakshi

Olympic Star Shooter Joins Ukraine Forces: ఉక్రెనియన్‌ చాంపియన్‌ షూటర్‌ క్రిస్టినా డిమిత్రెంకో తన మాతృభూమి రక్షణ కోసం ఉక్రెయిన్‌ బలగంలో చేరింది. ఆమె 2016 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో బయాథ్లాన్‌లో స్వర్ణం గెలుచుకుందిలో స్వర్ణ పతకం గెలుచుకుంది. బయాథ్లాన్‌ అనేది స్కీయింగ్, రైఫిల్‌ షూటింగ్‌లను మిళితం చేసే క్రీడ. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న కార్పాతియన్ పర్వతాలలో అంతర్జాతీయ పోటీ కోసం ప్రాక్టీసు చేస్తోంది.

అంతేగాదు క్రిస్టినా ఫిబ్రవరి 27న స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఇటలీతో పోటీపడాల్సి ఉంది. ఆమె కీవ్‌, చెర్నిహివ్‌లలో రష్యా బలగాల విధ్వంసాన్ని తెలుసుకుని ఉక్రెనియన్‌ యుద్ధంలో చేరాలని నిర్ణయించుకుంది. అంతేగాదు యుద్ధంలో పాల్గొని ఆయుధాలను చేతపట్టడానికి కూడా అర్హత సాధించింది. క్రీస్టినా ఇలాంటి పరిస్థితి ఒకటి తన జీవితంలో ఎదరవుతుందని తాను ఊహించలేదని చెప్పింది. పైగా తనకు శత్రువంటే భయం లేదని, వాళ్లకసలు అవకాశం ఇవ్వకుండా దాడి చేస్తానని చెబుతోంది.

అంతేగాదు ఆటలో ఉన్న యుద్ధంలో ఉన్నా చివరి వరకు ఉంటానిని విజయం మనదేనని విశ్వాసం వ్యక్తం చేసింది. అదీగాక ఉక్రేనియన్ దళాలు రష్యా దళాలను ఖార్కివ్ నుంచి వెనక్కి మళ్లేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు ఉక్రేనియన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌  జెలెన్‌ స్కీ కూడా డాన్బాస్ ప్రాంతంలో పరిస్థితి చాలా కష్టంగా ఉందని, రష్యా దళాలు ఏదోరకంగా దురాక్రమణ చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. 

(చదవండి: పుతిన్‌ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?)

మరిన్ని వార్తలు