ghost of kyiv: రష్యాని ఠారెత్తిచ్చిన ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌ మృతి

30 Apr, 2022 13:35 IST|Sakshi
ఘోస్ట్ ఆఫ్ కైవ్‌గా పిలిచే మేజర్‌ స్టెపాన్ తారాబల్కా(ఫైల్‌ ఫోటో)

అతనుయుద్ధం మొదలైన తొలిరోజే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేసి గార్డియన్‌ ఏంజెల్‌గా ప్రశంసలు అందుకున్నాడు. వైమానిక దాడులతో రెచ్చిపోతున్న రష్యాకి దడ పుట్టేలా చేశాడు. ఎవరా పైలెట్‌ ఫైటర్‌ అని రష్యా బలగాల్లో ఒకటే ఉత్కంఠ. రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసి సుమారు 40 యుద్ధ విమానాలకు కూల్చేశాడు ఉక్రెయిన్‌లో ఘొస్ట్‌ ఆఫ్‌ కీవ్‌గా పిలిచే యుద్ధ వీరుడు. రష్యా బలగాలను మట్టికరింపించేలా చివరి శ్వాస వరకు పోరాడాడు.
war hero dies in battle after shooting down 40 Russian aircraft: ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్‌ ఫైటర్‌ పైలెట్‌ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. అతను మిగ్‌ 29 ఫైలెట్‌లో వెళ్తున్నప్పుడూ శత్రుదళాలు జరిపిన కాల్పులో మరణించాడని తెలిపారు. అతను యుద్ధం మొదలైన తొలరోజునే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేశాడని చెప్పారు. దీంతో అతన్ని ఉక్రెనియన్లు గార్డియన్‌ ఏంజెల్‌గా ప్రశంసించారు.

అంతేకాదు తారాబల్కా ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌గా యుద్ధంలో రహస్య ఆపరేషన్లు చేపట్టి దాడులు చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చాడు. దీంతో రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసే ఒక భయంకరమైన వ్యక్తిగా మారాడు. తారాబాల్కకు మరణానంతరం యుద్ధంలో కనబర్చిన ధైర్యసాహసాలకు ఇచ్చే ఉక్రెయిన్ అత్యుత్తమ పతకం ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్, హీరో ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదును అందించారు. అతనికి భార్య ఒలేనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొరోలివ్కా అనే చిన్న గ్రామంలోని శ్రామిక కుటుంబంలో జన్మించారు.

అతను చిన్నప్పుడూ తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్‌లు పైలట్ కావాలనుకునేవాడు. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రభుత్వం తారాబల్కా మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. ఉక్రెయిన్‌ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడు. తారాబల్కా మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. 

(చదవండి: రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్‌ మ్యాగజైన్‌పై జెలెన్‌స్కీ)

మరిన్ని వార్తలు