Grandma combat training: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!

17 Feb, 2022 12:26 IST|Sakshi

Ukrainian Grandmother Pick UP AK 47 Rifle: రష్యా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో పెద్ద  ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉక్రెయిన్‌ వాసులకు అమాంతం యుద్ధ భయాన్ని పెంచేసింది. ఓ పక్క అమెరికా రష్యాని హెచ్చరిస్తూ వస్తోంది. దీంతో ఉక్రెయిన్‌ తమ దేశంలోని పెద్దల నుంచి పిల్లల వరకు తమని తాము రక్షించుకోవడమే కాక దేశాన్ని కూడా రక్షించుకుకోనేలా శిక్షణ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అయితే అందుకు పిల్లలు, పెద్దలు కూడా ఏ మాత్రం భయందోళనలకు గురికాకుండా సైనిక శిక్షణ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం.

ఈ నేపథ్యంలోనే వాలెంటైనా కాన్‌స్టాంటినోవ్‌స్కా అనే 79 ఏళ్ల ఉక్రెయిన్‌ బామ్మ ఏకే 47 గన్‌ని పట్టుకుని సైనిక శిక్షణ తీసుకుంటోంది. ఈ మేరకు ఆమె తూర్పు ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో జాతీయ గార్డు సాయంతో 79 ఏళ్ల వృద్ధ మహిళ అసాల్ట్ రైఫిల్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చకుంటోంది. అయితే అక్కడ స్థానిక మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తే.. "ఆమె ఈ పని నేను మాత్రమే కాదు మీ అమ్మ అందరూ కచ్చితంగా నేర్చుకునేందుకు సన్నద్దమవుతారు. ఎందుకంటే వారు తమ పిల్లలను, దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై సమయం ఆసన్నమైంది" అని చెప్పింది.

సరిహద్దుల వద్ద రష్యా దళాల ఉద్రిక్తలు కొనసాగుతున్నందున  ప్రజలకు ప్రాథమిక సైనిక పద్ధతులను నేర్పడం ఈ శిక్షణ లక్ష్యం. రాగ్-ట్యాగ్ సైన్యాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక కసరత్తులలో ఇది ఒకటి. అందులో భాగంగానే ఈ బామ్మ సైనికి బెటాలియన్‌లోకి చేరి సైనిక కసరత్తులు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను హీరో అంటూ ప్రశంసంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు