ఉక్రెయిన్‌ని మట్టికరిపించేలా...తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా!

17 Jul, 2022 18:54 IST|Sakshi

Russian rockets and missiles have pounded cities in strikes: రష్యా బలగాలు క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లోని నగరాలను నేలమట్టం చేశాయి. దీంతో ఆయా నగరాల్లో వేలాదిమంది మృతి చెందారు. తూర్పు ఉక్రెయిన్‌ దిశగా దాడులు జరిపిన రష్యా బలగాలు ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్‌ దాడులను నిరోధించేలా తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది రష్యా. అదీగాక ఉక్రెయిన్‌​ సైన్యాన్ని నిరోధించేలా దాడులు తీవ్రతరం చేయమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశించారు కూడా. ఈ మేరకు రష్యా భూ, వాయు, జల మార్గాల్లో దాడులను వేగవంతం చేసింది.

ప్రస్తుతం డోనెట్స్క్‌కి తూర్పు ప్రాంతమైన ఉక్రెయన్‌లోని కీలక నగరం స్లోవియన్స్క్‌పై దాడి చేసేందుకు రష్యా బలగాలు రెడీ అవుతున్నట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఈ మేరకు తూర్పు ఉక్రెయిన్‌ నుంచి దాడులకు తెగబడ్డ రష్యా ఒక్కో నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటూ...తదుపరి  దశ దాడులకు సన్నహాలు చేస్తోంది. అంతేకాదు రష్యా దక్షిణ ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాలలో రష్యా తన రక్షణ స్థానాలను పటిష్టం చేసుకుంటూ దాడులుకు సమయాత్తమవుతోంది.

మరోవైపు ఉక్రెయిన్‌ కూడా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలు సాయంతో సుమారు 30 రష్యన్ లాజిస్టిక్స్, మందుగుండు సామగ్రి కేంద్రాలపై విజయవంతమైన స్ట్రైక్స్ స్ట్రింగ్ జరిపింది. దీనికి ప్రతస్పందనగా రష్యా దాడులను తీవ్రతరం చేయడమే కాకుండా క్షిపిణి దాడులతో ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడింది. ఏదీఏమైన రష్యా ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ... ఉక్రెయిన్‌ని మట్టికరిపించే దిశగా విధ్వంసకర దాడులకు తెగబడుతోంది

మరిన్ని వార్తలు