పుతిన్‌ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్‌స్కీ షాకింగ్‌ వ్యాఖ్యలు

20 Jan, 2023 17:36 IST|Sakshi

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జెలెన్‌స్కీ గురువారం దావోస్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌)లోని వీడియో కాల్‌లో ప్రసంగిస్తూ..నాకు పుతిన్‌ బతికే ఉన్నారో లేదో తెలియడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో శాంతి చర్చలు ఎప్పుడూ ప్రారంభమవుతాయన్న అంశంపై ప్రశ్నలు రావడంతో జెలెన్‌స్కీ ఈ విధంగా స్పందించారు. అయినా పుతిన్‌ తాను ఉనికిలో ఉండేందుకే ఇష్టపడరంటూ విమర్శించారు.

ఆ సమావేశంలోని బ్రేక్‌ఫాస్ట్‌ ఈవెంట్‌లో జెలెన్‌స్కీ మాట్లాడుతూ..ఈ రోజు ఎవరితో దేని గురించి మాట్లాడాలో అస్సలు అర్థం కావడం లేదు. ఆయన గ్రీన్‌ స్క్రీన్‌(శాంతికి)కి వ్యతిరేకంగా కనిపించే పుతిన్‌ సరైన వారని అనిపించడం లేదు. అసలు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడో లేదా అక్కడ ఇంకోకరెవరైనా ఆయన స్థానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదంటూ పుతిన్‌పై జోక్‌లు పేల్చారు. మీరంతా యూరోపియన్‌ నాయకులకు శాంతి చర్చలు గురించి ఎలా వాగ్దానం చేస్తారో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు.

ఎందుకంటే ఆయన శాంతి అంటూనే తర్వాత రోజే పూర్తి స్థాయిలో దళాలతో దాడులు నిర్వహిస్తాడు. అందువల్ల తనకు శాంతి చర్చలు అంటే ఎవరితోనో తనకు అర్థం కావడం లేదంటూ జెలెన్‌స్కీ తనదైన శైలిలో రష్యాకి గట్టి కౌంటరిచ్చారు. జెలెన్‌స్కీ ప్రసంగం అయిన కొద్ది గంటల్లోనే క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "దీన్ని బట్టి రష్యా, పుతిన్‌, ఉక్రెయిన్‌, జెలెన్‌స్కీ ఒక పెద్ద సమస్య అని స్పష్టంగా తెలుస్తోందని గట్టి కౌంటరిచ్చారు. అదీగాక జెలెన్‌స్కీ మానసికంగా రష్యా లేదా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ప్రత్యక్షంగానే అవగతమవుతోంది.

అంతేగాదు రష్యా ఉనికిలోనే ఉంటుంది, తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఉనికిలోనే ఉంటారు. అదే ఉక్రెయిన్‌ వంటి దేశానికి మంచిది" అని పెస్కోవ్‌ ధీటుగా సమాధానమిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్లింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా పుతిన్‌ ఇటీవల కాస్త పబ్లిక్‌ ఇవెంట్లకి దూరంగా ఉండటంతో  జెలెన్‌ స్కీ పుతిన్‌ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదీగాక పుతిన్‌ కూడా డిసెంబర్‌లో జరగాల్సిన వార్షిక విలేకరులు సమావేశాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు సమాచారం. 

(చదవండి: నో డౌట్‌! రష్యా గెలుపు పక్కా!: పుతిన్‌)

మరిన్ని వార్తలు