ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి స్ట్రాంగ్‌ కౌంటర్‌!

1 Dec, 2022 14:43 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కొద్ది రోజుల క్రింత ఓ ప్రతిపాదన చేశారు. మాస్కో ఆక్రమిత ఉక్రేనియన్‌ ప్రాంతాలలో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం, క్రిమియన్‌ ద్వీపకల్పంపై రష్యా సార్వభౌమత్వాన్ని అంగీకరించటం, ఉక్రెయిన్‌కు తటస్థ హోదా ఇవ్వడం వంటి శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించారు. అదికాస్త వివాదానికి దారి తీసింది. తాజాగా మస్క్‌ ప్రతిపాదనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ. తమ దేశం వచ్చి అక్కడి పరిస్థితులను గమనించాక మాట్లాడాలని స్పష్టం చేశారు. 

ద న్యూయార్క్‌ టైమ్స్‌ బుధవారం నిర్వహించిన డీల్‌బుక్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో పాల్గొన్న జెలెన్‌స్కీ.. ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనపై మండిపడ్డారు. ఉక్రెయిన్‌కు వచ్చి చూడాలని స్పష్టం చేశారు. ‘ఆయనను కొందరు ప్రభావితం చేసి ఉండొచ్చు. లేదా ఆయనే స్వతహాగా ఆ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నా. రష్యా చేసిన మారణకాండను అర్థం చేసుకోవాలనుకుంటే.. ఉక్రెయిన్‌ వచ్చి సొంతంగా పరిస్థితులను పరిశీలించాలి. ఆ తర్వాత ఈ యుద్ధానికి ముగింపు ఎలా పలకాలనే విషయాన్ని సూచించాలి. ఈ యుద్ధం ఎవరు ప్రారంభించారు? ఎవరు ముంగించాలి?’ అని పేర్కొన్నారు జెలెన్‌స్కీ.

ఇదీ చదవండి: Russia Ukraine War: రష్యా సైనికుల భార్యలే ‘రేప్‌ చేయమ’ని ప్రోత్సహిస్తున్నారు: జెలెన్‌స్కీ భార్య

మరిన్ని వార్తలు