కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్‌

4 Feb, 2023 10:42 IST|Sakshi

బ్రిటన్‌ ప్రధానిగా అత్యున్నత పదవిని అలంకరించిన రిషి సునాక్‌ తన ‍ప్రధాని పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యోగం తనకు కత్తిమీద సాములాంటిదే అయినా దీన్ని తన కర్తవ్యంగా భావించి సమర్ధవంతంగా చేస్తానని చెప్పారు. ఈ మేరకు మీడియా సమావేశంలో భారత సంతతి వ్యక్తిగా ఈ  పదవిని చేపట్టి సరిగ్గా వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా రిషి సునాక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ బాధ్యతలను చాలా వైవిధ్యంగా పూర్తి చేయగలనని చెప్పారు. హిందూమతంలో ఉన్న 'ధర్మం' అనే భావన తనకు ప్రేరణ అని, అదే ఈ పదవిని తన కర్తవ్యంగా మారుస్తుందని చెప్పుకొచ్చారు.

అదే తనకు ప్రజలు ఆశించిన విధంగా పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. అలాగే తాను సేవను ప్రగాఢంగా విశ్వశిస్తునని తెలిపారు. అందుకే ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులు గురించి తెలిసినా..ముందుకు వచ్చానని చెప్పారు. తన భార్య అక్షతామూర్తి గురించి కూడా ప్రస్తావించారు. ఆమెకు తాను ఎలా ప్రపోజ్‌ చేసింది, ఆమె తనకిస్తున్న సపోర్టు గురించి కూడా మాట్లాడారు. అలాగే ఆయన ఆదాయ వివరాలు గురించి ప్రశ్నించగా.. ఎప్పటిలానే మౌనం వహించారు.

అదే సమయలో పన్ను రిటర్న్‌లకు సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలను పారదర్శకంగా ఉంచడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలిపారు. వేతనం విషయమై ప్రభుత్వ రంగ ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..తాను నర్సులకు భారీ వేతనం పెంచేందుకు ఇష్టపడతానని చెప్పారు. కానీ అలా చేస్తే ద్రవ్యోల్బణం పెరుతుందని అందువల్ల తాను చేయలేనని కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాదరణ పొందకపోయినా పర్వాలేదు గానీ ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా దేశానికి దిశా నిర్దేశం చేయడమే కీలమైన చర్య అని సునాక్‌ చెప్పారు.

(చదవండి: చైనా నిఘా బెలూన్‌ వ్యవహారం: అంతలోనే అక్కడ మరొకటి!)

మరిన్ని వార్తలు