సుస్థిరాభివృద్ధి లక్ష్యాల న్యాయవాదిగా నోబెల్‌ గ్రహిత కైలాశ్‌ సత్యార్థి: యూఎన్‌

18 Sep, 2021 08:31 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ 76వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) న్యాయవాదిగా నోబెల్‌ గ్రహిత  కైలాశ్‌ సత్యార్థిని నియమిస్తున్నట్లుగా శుక్రవారం ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటెర్రస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు  కైలాశ్‌ సత్యార్థి తోపాటు స్టెమ్‌  కార్యకర్త వాలెంటినా మునోజ్‌ రబనాల్‌, మైక్రోసాఫ్ట్‌ ప్రెసిడెంట్‌ బ్రాండ్‌స్మిత్‌, కే పాప్‌ సూపర్‌స్టార్స్‌ బ్లాక్‌ పింక్‌లను ఎస్‌డీజీ కొత్త న్యాయవాదులుగా నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిక ప్రకటనలో తెలిపింది.
(చదవండి: ఫస్ట్‌ టైం.. బెజోస్‌-మస్క్‌ మధ్య ఓ మంచి మాట)

ఈ సందర్భంగా యూఎన్‌ చీఫ్‌ గుటెర్రెస్‌ మాట్లాడుతూ... కొత్తగా నియమితులైన ఈ ఎస్‌డీజీ న్యాయవాదులు తమ సరికొత్త విధానాలతో సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా నడిపించటమే కాక తమ ఆశయాలను నెరవేర్చుకోగలరంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ పురోగాభివృద్ధికై 17 అంశాలతో కూడిన సుస్థిరభివృద్ధి లక్ష్యాల కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పనిచేస్తామని అంగీకరించిన సంగతిని గుర్తు చేశారు.

ఈ క్రమంలో 2030 కల్లా ఐక్యరాజ్యసమితి వర్కింగ్‌ గ్రూప్‌ సుస్థిరాభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్ష్యాల గురించి కూడా ప్రస్తావించారు. బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణ, బానిసత్వం వంటి వాటిపై నోబెల్‌ గ​గ్రహిత కైలాశ్‌  సత్యార్థి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 
(చదవండి: ఎర్త్‌ - 2.0,‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’)

మరిన్ని వార్తలు