భద్రతామండలికి ఐదు దేశాలు ఏకగ్రీవ ఎన్నిక

13 Jun, 2021 04:26 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమై న భద్రతామండలికి శుక్రవారం బ్రెజిల్, యూఏఈ, అల్బేనియా, ఘనా, గబాన్‌ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 15 మంది సభ్యులుండే మండలిలో చోటు సంపాదించడం చాలా దేశాలు ఒక మహదవకాశంగా భావిస్తాయి. సిరియా, యెమెన్, మాలి, మయన్మార్‌ దేశాల్లో సంక్షోభాలు మొదలుకొని.. ఉత్తరకొరియా, ఇరాన్‌ల అణ్వాయుధ ముప్పు, ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌), అల్‌ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థల దాడులు దాకా అనేక అంశాలపై తమ వాణిని బలంగా వినిపించేందుకు మండలి ముఖ్య వేదిక కావడమే ఇందుకు కారణం. ఆల్బేనియాకు మండలిలో చోటు లభించడం ఇదే మొదటిసారి కాగా, బ్రెజిల్‌కు ఇది 11వ సారి. రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఎన్నికల ఫలితాలను జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ వొల్కన్‌ బొజ్‌కిర్‌ ప్రకటించారు. మండలిలోని 15 సభ్య దేశాల్లో వీటో అధికారం ఉన్న అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్సులతోపాటు 10 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి.

మరిన్ని వార్తలు