ఆంక్షలున్నా ఆగని ఉత్తరకొరియా

7 Feb, 2022 05:29 IST|Sakshi

న్యూయార్క్‌: ఉత్తరకొరియా తన అణ్వాయుధ క్షిపణి పరీక్షా కార్యక్రమాలను కొనసాగిస్తూనేఉందని ఐరాస నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. తాజాగా అణ్వాయుధాలకు అవసరమైన సామగ్రిని కూడా ఉత్తరకొరియా సంపాదించిందని తెలిపారు. దీంతో ఆ దేశం క్షిపణి పరీక్షలను వేగవంతం చేసిందని, జనవరిలో పలు పరీక్షలు జరిపిందని నివేదిక తెలిపింది. అణ్వస్త్రాలకు అవసరమైన సాంకేతికతను సైబర్‌ మార్గంలో సంపాదిస్తోందని తెలిపింది. ఇందుకు కావాల్సిన ఆర్థిక సంపత్తిని సైబర్‌అటాక్స్‌తో సంపాదిస్తోందని వెల్లడించింది.

మరిన్ని వార్తలు