Sri Lanka Crisis: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన

21 Jul, 2022 10:05 IST|Sakshi

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రజలకు తక్షణం మద్దతు ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల బృందం కోరింది. అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి సాయం అందించాలని సూచించింది. శ్రీలంకలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు మానవ హక్కుల నిపుణులు.' శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం వెంటనే స‍్పందించాలి. అది కేవలం మానవతా సంస్థల నుంచే కాదు.. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రైవేటు లెండర్స్‌, ఇతర దేశాలు ముందుకు రావాలి.' అని పేర్కొన్నారు.

శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, విద్యుత్తు, ఇంధన సంక్షోభం, ఆర్థిక వ్యవస్థ పతనంపై తొమ్మిది మంది నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మానవ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. సరైన ఆహారం, వైద్యం అందకపోవటం వల్ల తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయని, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు సహాయం అవసరమని తెలిపింది. 

అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల చీఫ్‌ మిచెల్‌ బచెలెట్‌. హింసాత్మక ఘటనలు జరగటాన్ని ఖండించారు. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు తీసుకునే నిర్ణయాల్లో మానవ హక్కులను ప్రధానంగా చూడాలన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాల వల్లే సంక్షోభం తలెత్తిందని తెలిపారు.

ఇదీ చదవండి: Sri Lanka Crisis: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే!

మరిన్ని వార్తలు