కాబూల్‌ ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి

28 Aug, 2021 06:16 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: కాబూల్‌లో గురువారం రాత్రి జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. పదుల సంఖ్యలో సామాన్య పౌరులు, చిన్నారులు, సైనికులను బలిగొన్న ఈ దాడులను శోచనీయమైనవిగా పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదంపై పోరు చాలా కీలకమైందనీ, అఫ్గాన్‌ భూభాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు గానీ, దాడి చేసేందుకు గానీ ఉపయోగించరాదని మండలి ఒక ప్రకటనలో పునరుద్ఘాటించింది. భారత్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న భద్రతా మండలి ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఐసిస్‌–కె పాల్పడినట్లుగా చెబుతున్న ఈ దాడిలో పౌరులు, చిన్నారులు, ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గర్హనీయం’ అని పేర్కొంది. పౌరుల తరలింపులో సాయ పడుతున్న ఆర్మీని, ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు