Viral Video: చైనా కమ్యునిస్ట్‌ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో

22 Oct, 2022 13:00 IST|Sakshi

చైనాలో అధికార కమ్యూనిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 20వ జాతీయ సదస్సు ఈనెల 16న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈమేరకు శనివారం కాంగ్రెస్‌ పార్టీ ముగింపు వేడుకలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఐతే అనుహ్యంగా చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ముగింపు వేడుకుల నుంచి నిష్క్రమించి బయటకు వచ్చేశారు.

అకస్మాత్తుగా హు జింటావో పైకి లేచి సెక్యూరిటీ సాయంతో బయటకు వెళ్లిపోవడంతో అక్కడున్నవారంతా షాక్‌తో అయోమయంగా చూస్తుండిపోయారు. అదీగాక ఆయన గత  ఆదివారం కాంగ్రెస్‌  పార్టీ సదస్సు ప్రారంభ వేడుకలో కూడా కాస్త అస్వస్థతకు గురైనట్లు కనిపించారు. ఇదిలా ఉండగా..ఐదేళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్‌ పార్టీ సదస్సు రాజ్యంగ సవరణలతో ముగిసింది. ఆ సదస్సులో తన పార్టీ రాజ్యంగ సవరణలో తైవాన్‌ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడం వ్యతిరేకించటంవంటి తీర్మానాన్ని ప్రధానంగా పొందుపరిచింది.

అంతేగాదు ఆ సమావేశంలో ముచ్చటగా మూడోసారి జిన్‌పింగ్‌కి అధికారం కట్టబట్టేందుకు పార్టీ  సిద్దమైంది కూడా. ఈ మేరకు పార్టీ సెంట్రల్‌ కమీటీ తోపాటు పార్టీ సభ్యులందరూ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఐతే ఈ ముగింపు వేడుకలో మాజీ అధ్యక్షుడు హు జుంటావో నిష్క్రమించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది

(చదవండి: జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం)

మరిన్ని వార్తలు