యూఏఈ నుంచి ప్రథమ మహిళా వ్యోమగామి

11 Apr, 2021 12:00 IST|Sakshi

దుబాయ్‌: అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపిన మొట్టమొదటి గల్ఫ్‌ దేశంగా రికార్డు సృష్టించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. మొట్టమొదటిసారిగా మహిళా వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపనున్నట్లు దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహ్మమద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ తెలిపారు. శనివారం ఆయన ప్రకటించిన ఇద్దరు వ్యోమగాముల పేర్లలో ఒకరు మహిళ కావడం విశేషం. తమకు అందిన సుమారు 4వేల దరఖాస్తుల నుంచి నౌరా అల్‌ మత్రౌషి, మొహమ్మద్‌ అల్‌–ముల్లాను ఇందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.

1993లో జన్మించిన మత్రౌషి అబుధాబిలోని నేషనల్‌ పెట్రోలియం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, అల్‌–ముల్లా ప్రస్తుతం దుబాయ్‌ పోలీస్‌ విభాగంలో పైలట్‌ శిక్షణావిభాగానికి అధిపతిగా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ త్వరలో అమెరికాలో టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ పొందనున్నట్లు వెల్లడించారు.
చదవండి: మార్స్‌పై బుల్లి హెలీకాప్టర్‌‌, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా?

మరిన్ని వార్తలు