బాబ్‌ డిలాన్‌ పాటలన్ని కొనేసిన యూజీ

8 Dec, 2020 08:57 IST|Sakshi

న్యూయార్క్‌: ప్రఖ్యాత రచయిత బాబ్‌ డిలాన్‌ పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఆయన రాసిన మొత్తం 600 పాటలను యూనివర్సల్‌ మ్యూజిక్‌ పబ్లిషింగ్‌ గ్రూప్‌ తన సొంతం చేసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. అంటే ఇకపై ఆయన పాటలపై పూర్తి హక్కులన్ని తమకే ఉంటుందని సదరు మ్యూజిక్‌ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఇందు​కు సంబంధించి ఒప్పందం కూడా ముగిసినట్లు యూఎంపీజీ  తెలిపింది. ఇందుకోసం యూఎంపీజీ ఆయనకు ఎంత మొత్తం చెల్లించిందనేది మాత్రం పేర్కొనలేదు. అయితే ఆయన పాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంతో తెలిసిన విషయయే. ఇందుకోసం యూఎంపీజీ ఆయనతో భారీగానే ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. ఆయన పాడిన పాటల క్యాట్‌లాగ్‌ను విలువను బట్టి కనీసం రూ. 100 మిలియన్‌ డాలర్లు ఉండోచ్చని  స్థానికి మీడియా అంచనాలు. (చదవండి: బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?)

అయితే యూఎంపీజీ తన ప్రకటనలో బాబ్‌ డిలాస్‌ 1962 నుంచి ఇప్పటి వరకు పాడిన మొత్తం క్యాట్‌లాగ్‌ పాటల జాబితాను తమ సంస్థ కనుగోలు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ సంస్థ ప్రస్తుతం అమెరికాలోని డిలాస్‌ మ్యూజిక్‌ కంపెనీతో పాటు సోనీ, ఏటీవి మ్యూజిక్‌ పబ్లిసింగ్‌‌ నిర్వహణ బాధ్యతను చేపట్టింది.  ఈ ఒప్పందం ముగిసే వరకు అమెరికా వెలుపల జరిగే పలు మ్యూజిక్‌ షోలను యూఎంపీజీనే నిర్వహిస్తుందని సోనీ, ఏటీవీ అధికారులు స్పష్టం చేశారు.  కాగా బాబ్‌ డిలాన్‌ 2016లో సాహిత్యంలో నోబెల్‌ పురస్కారం పొందారు. నోబెల్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి పాటల రచయితగా ఆయన రికార్డు సృష్టించారు.

మరిన్ని వార్తలు