అతడికి 23, ఆమెకు 60.. ‘‘నానమ్మలాంటి ఆమెతో లవ్వేంటిరా బాబు’’!

11 Jun, 2021 17:30 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న స్టోరీ

వాషింగ్టన్‌: మన సమాజంలో పెళ్లి, ప్రేమ వంటి బంధాల్లో అబ్బాయికి ఎంత వయసున్న పర్వాలేదు కానీ.. అమ్మాయికి మాత్రం తక్కువ వయసే ఉండాలి. అలా కాకుండా పెద్ద వయసు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ముందుగా చెప్పే మాట డబ్బుకు ఆశపడి చేసుకున్నారు అంటారు. సదరు వ్యక్తిని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తారు. సేమ్‌ ఇలాంటి స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన వారంతా సదరు యువకుడిని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. ఆ వివరాలు.. 

అమెరికాకు చెందిన 23 ఏళ్ల క్వారన్‌ అనే యువకుడు 60 ఏళ్ల చెర్లి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వ్యత్యాసం. వయసు తమకు పెద్ద సమస్యే కాదంటున్నారు ఈ జంట. పైగా ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేసే వీడియోలు, రొమాన్స్‌ చేసే వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. ఇవి చూసిన నెటిజనులు వీరిని తెగ ట్రోల్‌ చేస్తుంటారు. ‘‘ఆమె చూడ్డానికి నీకు నానమ్మలా ఉంది.. పోయి పోయి ఈ ముసలామెను ఎలా లవ్‌ చేశావ్‌.. అసలు మీ బంధాన్ని మీ కుటుంబ సభ్యులు యాక్సెప్ట్‌ చేశారా’’ అని ప్రశ్నిస్తున్నారు. 

ఈ క్రమంలో చెర్లి మాట్లాడుతూ.. ‘‘కవర్‌ పేజ్‌ చేసి బుక్‌లో ఏముందో ఊహించే ప్రయత్నం చేయకండి. మా బంధం చాలా నిజాయతీతో కూడుకున్నది. పైకి కనిపించే ఆకారం ముఖ్యం కాదు. మేం ఒకరినొకరం ఎలా అర్థం చేసుకుంటున్నామనదే ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యమైనది మేం మనసు చూసి ప్రేమించుకున్నాం’’ అని తెలిపారు. 

అంతేకాక ‘‘నా కొడుకులు చెర్లి కంటే రెండు మూడు సంవత్సరాలు పెద్దవారు. వారు మా బంధాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారు. వారే మాకు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తుంటారు. నేనేం తప్పు చేయడం లేదు. మేం కలిసి డ్యాన్స్‌ చేస్తుంటాం.. సానుకూల ఆలోచనలను వ్యాప్తి చేస్తున్నాం. మా ఇద్దరి మధ్య ఎన్నో మంచి విషయాలున్నాయి. మమ్మల్ని ద్వేషించే వారి గురించి మేం పట్టించుకోం. మా మనసులో ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది. ఇక వయసు అనేద కేవలం ఒక నంబర్‌ మాత్రమే. మనల్ని ఎవరు ప్రేమించాలో మనం నిర్ణయించుకోలేం. మా ఏజ్‌ గురించి కామెంట్‌ చేసేవారిని మేం అసలే పట్టించుకోం’’ అన్నారు. 

ఇక వీరిని విమర్శించే వారే కాక ప్రశంసించే వారు కూడా ఉన్నారు. ‘‘ఏవరేమన్నా మీరు పట్టించుకోవద్దు.. మీ మనసుకు నచ్చిన పని మీరు చేయండి. జనాల మాటలు పట్టించుకుని.. మీ సంతోషాలను పాడు చేసుకోకండి.. ప్రతి ఒక్కరు సంతోషాలను పొందడానికి అర్హులు’’ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు. 

చదవండి: 
వైరల్‌: పి. మమతా బెనర్జీ వెడ్స్‌ ఏఎం సోషలిజం...
వైరల్‌: చావు నుంచి తప్పించుకున్న మహిళలు

మరిన్ని వార్తలు