ఒకేసారి ముగ్గురు యువతులతో డేటింగ్‌.. ట్విస్ట్ ఏంటంటే..

20 Jul, 2021 13:19 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈ మధ్యకాలంలో తరచుగా అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతున్న సంఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. అయితే, వీటి వెనుక అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఒక యువకుడు.. ఇద్దరు, ముగ్గురు యువతులతో డేటింగ్‌ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల యువతులు తామేమి తీసిపోనట్టు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇలాంటి మోసాలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, యూఎస్‌కి చెందిన ఒక యువకుడు ఒకేసారి ముగ్గురు యువతులను మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు.. ఈ సంఘటన బోయిస్‌లో జరిగింది. కాగా, బోయిస్‌ కు చెందిన మోర్గాన్‌ అనే యువకుడు.. బెకా కింగ్‌, అబిరాబర్ట్స్‌, టాబోర్‌ యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. కొంత కాలం ఇతగాడి మోసం బాగానే సాగింది. అయితే, కొన్ని రోజుల తర్వాత టాబోర్‌ అనే యువతి, తన ప్రియుడి మోసాన్ని గ్రహించింది. దీంతో ఈ బండారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తన చేదు అనుభవాన్ని సిఎన్‌ఎన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

టాబోర్‌ ఒక రోజు ఫేస్‌బుక్‌లో తన ప్రియుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలను చూసింది. దీంతో ఆమె అనుమానంతో తన ప్రియుడి అకౌంట్‌ను తెరిచి చూసింది. ఆమెకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. అతను మరో యువతితో డేటింగ్‌ చేస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. తాను ఎవరితో అయితే, జీవితం పంచుకోవాలనుకుందో.. అతను మోసం చేయడంతో తట్టుకోలేక పోయింది. దీంతో సదరు, ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. అతని అకౌంట్‌ను మరింత పరిశీలించింది. అతనితో డేటింగ్‌లో బెకాసింగ్‌, రాబర్ట్స్‌అనే మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించింది. అయితే, టాబోర్‌ వీరిని రహస్యంగా కలుసుకుంది. తన ప్రియుడి మోసం గురించి వారికి తెలియజేసింది.

దీంతో అతని బండారం కాస్త బయటపడింది. ఒకరోజు మోర్గాన్‌, టాబోర్‌ను కలవటానికి వచ్చాడు. ఈ క్రమంలో వారంతా ఒక్కచోటికి చేరి అతగాడిని నిలదీశాడు. వారిని ఒక చోట చూసి అతను షాక్‌కు గురయ్యాడు. అయితే, అప్పటికి వారికి మాయమాటలు చెప్పాడానికి ప్రయత్నించాడు. ఆ ముగ్గురు యువతులు ప్రియుడికి బుద్ధి చెప్పారు. అతగాడి బారినుంచి తప్పించుకున్నారు. అతగాడు వీరినే కాకుండా, మరో ఆరుగురిని కూడా మోసం చేస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఈ మోసం నుంచి బయటకు పడ్డాక.. బెకా కింగ్‌, అబిరాబర్ట్స్‌, మోర్గాన్‌ టాబోర్‌లు మంచి స్నేహితులుగా మారిపోయారు.

ఈ మోసం నుంచి బయటపడాటానికి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో వారు ముగ్గురు కూడా ఒక పాత బస్సు కొనుగోలు చేశారు. వారు దానికి కొన్ని మరమ్మత్తులు చేయించారు. ఆ తర్వాత వారి యాత్రను ప్రారంభించారు. దీనికి కొంత మంది దాతలు కూడా సహయం చేశారు. ఈ క్రమంలో వారు.. బోయిస్‌లోని సరస్సులు, గ్రాండ్‌ టెటన్‌ నేషనల్‌ పార్క్‌, ఎల్లో స్టోన్‌ నేషనల్‌ పార్క్‌ లను సందర్శించినట్లు తెలిపారు. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాము. మా గతంలోని చేదు అనుభవాలను పూర్తిగా మరిచిపోయామని రాబర్ట్, బెకాసింగ్‌ తెలిపారు. అతనికి ప్రేమను పొందే హక్కులేదు. ఇప్పుడు తామంతా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించామని టాబోర్‌ తెలియజేసింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు