ఎన్నికల వేళ అమెరికా భారీ ప్యాకేజీ

25 Sep, 2020 08:47 IST|Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్య రంగాల్లో మిడిల్‌ టూ హై స్కిల్డ్‌ హెచ్‌1బీ వృత్తుల శిక్షణనకు గాను 150 మిలియన్‌ డాలర్ల(సుమారు 1,100కోట్ల రూపాయలు) ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో ప్రస్తుత శ్రామిక శక్తితో పాటు, భవిష్యత్ శ్రామిక శక్తిని పెంచడానికి గాను కొత్త తరం కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి ఈ హెచ్‌1బీ వర్క్‌ఫోర్స్‌ గ్రాంట్‌ ఉపయోగపడుతుందని కార్మిక శాఖ ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కార్మిక మార్కెట్లలో అంతరాయాలను కలిగించడమే కాక, అనేక విద్య, శిక్షణా సంస్థలు, యజమానులు శిక్షణను ఎలా అందించాలో పునరాలోచించవలసిన పరిస్థితులను తీసుకువచ్చింది అని కార్మిక శాఖ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు)

ఈ భారీ ప్యాకేజీ డిపార్ట్‌మెంట్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో మరింత సమగ్రమైన శ్రామికశక్తి వ్యవస్థను ప్రోత్సహించడానికి.. నిధులు, వనరులను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించబడింది. ఇది దరఖాస్తుదారులకు వినూత్నమైన ట్రైన్రింగ్‌ ప్రొగ్రాంని అందించడమేకాక, ఆన్‌లైన్‌తో సహా విభిన్న రీతుల్లో ట్రైనింగ్‌ డెలివరీని అందిస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని స్థానిక పబ్లిక్‌-ప్రైవేట్ భాగస్వామ్యాల ద్వారా ముందుకు తీసుకెళ్తుంది. వీరు ఆయా వర్గాలలోని వ్యక్తులకు కీలకమైన పరిశ్రమ రంగాల్లో మిడిల్‌ టూ హై స్కిల్డ్‌ హెచ్‌1బీ వృత్తులలో ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి శిక్షణనిస్తారు. ఈ ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌లో విస్తృత శ్రేణి తరగతి గది, ఉద్యోగ శిక్షణ, కస్టమైజ్డ్‌ ట్రైనింగ్‌, ప్రస్తుత కార్మికుల శిక్షణ, రిజిస్టర్డ్‌ అప్రెంటిస్‌షిప్ ప్రొంగ్రాం, పరిశ్రమ-గుర్తింపు పొందిన అప్రెంటిస్‌షిప్ ప్రొంగ్రాం మాడ్యూల్స్‌ ఉంటాయి. ఈ పబ్లిక్‌- ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ కార్యక్రమం ద్వారా ఫెడరల్‌, స్టేట్‌, లోకల్‌ ఫండింగ్‌ స్ట్రీమ్స్‌ మాత్రమే కాక ప్రైవేట్‌ సెక్టార్‌లో ట్రైనింగ్‌ కార్యక్రమం, ఉపాధి సేవలు, సహాయక సేవలకు సంబంధించి ఉపాధి అవకాశాలను గరిష్టంగా పొందటానికి అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు