మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!

3 Jan, 2022 11:55 IST|Sakshi

Capitol rioters tears remorse don’t spare them from jail: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన దాడులను ప్రపంచ దేశాలన్ని విస్తుపోయి చూసిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు కారణమైన వాళ్లందరికి కఠిన శిక్షలు విధించారు. దీంతో వారంతా కన్నీటి పర్యంతమవుతూ నాటి ఘటనకు సిగ్గుపడుతున్నాం అని చెబుతున్నప్పటికి శిక్షలు నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని యూఎస్‌ కోర్టు స్పష్టం చేసింది.

(చదవండి: భారత సంతతి అమృతపాల్‌ సింగ్‌ మాన్‌కు యూకే గౌరవ జాబితాలో చోటు !)

అమెరికా పార్టమెంటు దాడుల ఘటనలో ఉద్యోగులు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పయారని ఇది చాలా క్రూరమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి సుమారు 700 మంది అభియోగాల ఉన్నాయి. అందులో ఫ్లోరిడా వ్యాపార యజమాని రాబర్ట్ పాల్మెర్కి ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటి వరకుర దాదాపు 71 మందికి శిక్షలు విధించారు. వారిలో కంపెనీ సీఈవో, ఆర్కిటెక్ట్, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ కల్నల్, జిమ్ యజమాని, మాజీ హ్యూస్టన్ పోలీసు అధికారి, యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ విద్యార్థి ఉన్నారు.

అయితే వారిలో యాభై-ఆరు మంది క్యాపిటల్ భవనంలో దాడులకు పాల్పడినందుకు నేరాన్ని అంగీకరించారు. అంతేకాదు ప్రతి శిక్షకు సంబంధించిన యూఎస్‌ చట్టాల ప్రకారం వారిలో చాలా మందికి గృహ నిర్బంధం లేదా వారాలు లేదా నెలలలో జైలు శిక్ష విధించబడింది. అయితే పోలీసు అధికారులపై దాడి చేసిన అల్లరిమూకలు మాత్రం ఏళ్ల తరబడి కటకటాలపాలయ్యారు. ఈ మేరకు మొత్తంగా ఇప్పటి వరకు 165 మంది నేరాన్ని అంగీకరించారని, పైగా అందులో ఎక్కువగా ఆరు నెలల గరిష్ట శిక్ష విధించే నేరాలకు పాల్పడినవారే.అధికారిక లెక్కల ప్రకారం మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ శిక్షలు పొందిన 22 మందితో సహా సుమారు 31 మంది నిందితులకు జైలు శిక్ష విధించబడింది.

మరో 18 మంది నిందితులకు గృహ నిర్బంధం విధించారు. మిగిలిన 22 మందిని గృహనిర్బంధం లేకుండానే ప్రొబేషన్‌లో ఉంచారు. అయితే యూఎస్‌లో న్యాయమూర్తులు తరచూ పశ్చాత్తాపాన్ని శిక్షలను నిర్ణయించడంలో కీలకమైన అంశంగా పేర్కొంటారు. దీంతో చాలా మంది నిందితులు  పశ్చాత్తాపతో అభ్యర్థించడం ప్రారంభించారు. ఈ మేరకు యూఎస్‌ డిస్ట్రిక్ట్ జడ్జి తాన్యా చుట్కాన్‌ మాట్లాడుతూ.. మీ అందరి పశ్చాత్తాపం నిజమైనదో కాదో చెప్పలేను. పైగా నేను మీ మనసులోకి తొంగి చూడలేను. ఈ కేసు తర్వాత మీరు మీ జీవితాన్ని నిర్వహించే విధానమే మీరు నిజంగా పశ్చాత్తాపపడుతున్నారా అనే దాని గురించి తెలియజేస్తుంది" అని అన్నారు.

(చదవండి: టెస్లా ఆటో పైలెట్‌ టీమ్‌కి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి!)

మరిన్ని వార్తలు