-

US CDC Issued a Level One COVID-19 Notice : భారత్‌, పాకిస్తాన్‌ పర్యటన కోసం లెవల్ వన్ హెల్త్ నోటీసులు

16 Nov, 2021 09:24 IST|Sakshi

Level One COVID-19 notice for Americans travelling: యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) భారతదేశానికి వెళ్లే అమెరికన్‌ల కోసం 'లెవల్ వన్' కోవిడ్‌-19 నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ముఖ్యంగా పర్యటించేవాళ్లు వ్యాక్సిన్‌లు తీసుకున్నట్లయితే ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్‌ పర్యటనకు కూడా 'లెవల్‌ వన్‌' ట్రావెల్ హెల్త్ నోటీసులు జారీ చేసింది.

(చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్‌ షేర్‌ చేయడంతో పరార్‌!!)

అంతేకాదు యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ భారత్‌, పాకిస్తాన్‌ల పర్యటన నిమిత్తం అమెరికన్లకు కొన్ని సూచనలను కూడా జారీ చేసింది. పైగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదం, మతపరమైన హింస తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్‌ పర్యటన ఎంతవరకు సుముఖం అనేదాని గురించి పునరాలోచించవలసిందిగా నొక్కి చెప్పింది. ఈ క్రమంలో భారత్‌కి పయనమయ్యేవారు కూడా  అక్కడ జరిగే నేరాలు, ఉగ్రవాదం కారణంగా మరింత జాగ్రత్తగా ఉండమంటూ సూచించింది.

అంతేకాదు తీవ్రవాదం, పౌర అశాంతి కారణంగా జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లవద్దని, అలాగే సాయుధ పోరాటానికి అవకాశం ఉన్నందున భారత్‌-పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో కూడాప్రయాణించవద్దని యూఎస్‌ విదేశాంగ శాఖ అమెరికా పౌరులను కోరింది. ఈ మేరకు భారత్‌ అధికారులు భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటిని తెలియజేయడమే కాక లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు పర్యాటక ప్రదేశాలలో జరుగుతున్నాయని నివేదించినట్లు కూడా యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

(చదవండి: యూకే లివర్‌పూల్‌ నగరంలో కారు బ్లాస్ట్‌... ఒకరు మృతి)

మరిన్ని వార్తలు