అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం

4 Jul, 2022 14:25 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా పౌరసత్వాల్లో భారతీయుల జోరు కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌ 15 వరకు 6,61,500 మందికి పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మనవారికి 12,928 మందికి పౌరసత్వం లభించింది. మెక్సికో నుంచి అత్యధికంగా 24,508 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. ఫిలిప్పీన్స్‌(11,316), క్యూబా(10,689), డొమినికస్‌ రిపబ్లిక్‌(7,046) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది. గతేడాది మొదటి ఐదు స్థానాల్లో మెక్సికో, భారత్‌, క్యూబా, ఫిలిప్పీన్స్‌, చైనా దేశాలు నిలిచాయి. కాగా, అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్‌ చేస్తున్నట్టు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం తెలిపింది. (క్లిక్: కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?)

మరిన్ని వార్తలు