యుద్ధానికి రష్యా గుడ్‌ బై చెప్పనుందా?.. అదే కారణమా?

15 Mar, 2022 17:24 IST|Sakshi

Russia Forced To Stop War Due To Lck of Resource:  ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధాల కొరత ఏర్పడనుందా?,  రష్యాకు యుద్ధం చేసే సామర్ధ్యం తగ్గిపోయిందా? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఎలాగైనా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న రష్యా.. అంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తుందని ప్రస్తుతం ఎవరూ అనుకోకపోయినా, ఏమైనా బలమైన కారణాలు ఉంటే మాత్రం యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి రష్యాకు తప్పదనే విశ్లేషణలు కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఐరోపా మాజీ యూఎస్‌ కమాండిగ్‌ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ స్పష్టం చేశాడు. 

ఈ మేరకు రష్యాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడు. రష్యన్లు త్వరలోనే వనరుల కొరత కారణంగా ఉక్రెయిన్‌ పై దాడిని ఆపే స్థితికి చేరుకోనుందని వెల్లడించారు. అంతేగాదు రష్యా బలగాలకు వనరుల కొరత తీవ్రంగా ఏర్పడునుందని నిపుణులు కూడా చెబుతున్నారని అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ మాట్లాడుతూ.. రష్యన్లు యావోరివ్‌లోని కర్ట్ వోల్కర్ శిక్షణా కేంద్రమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ రాయబారిని వెంబడించడమే కాక ఉక్రెయిన్‌కి పోలాండ్‌ నుంచి యుద్ధ సామాగ్రిని తరలించే సరిహద్దుల వద్ద రష్యన్లు గస్తీ కాసారని అన్నారు.

అయితే నాటో భూభాగాలకు సమీపంలో జరిగిన దాడిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు.  పైగా రష్యన్లు వనరుల కొరత కారణంగా దాడిని ఆపాల్సిన పరాకాష్టకు చేరుకున్నారని స్పష్టం చేశారు. రష్యాలో సుమారు 10 రోజుల్లో మానవ శక్తి, మందుగుండు సామాగ్రి కొరత ఏర్పడనుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు గానూ మాస్కోను శిక్షించేందుకు 27 దేశాల కూటమి కొత్త ఆంక్షలను ఆమోదించినట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది.

అంతేగాక ఈయూ ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఫ్రాన్స్, కూటమి "మా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించి, ఉక్రెయిన్‌పై దురాక్రమణలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని, అలాగే రష్యన్ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలకు సంబంధించిన ప్యాకేజీని ఆమోదించింది" అని  తెలిపింది". మొత్తంగా ఈయూ నియంత్రణ చర్యలు ఇప్పుడు సుమారు 862 మంది వ్యక్తలకు, 53 సంస్థలకు వర్తించనున్నాయి.

(చదవండి: యుద్ధం వేళ ఆ మాత్రలకు ఎందుకంత డిమాండ్‌?)

>
మరిన్ని వార్తలు