క్వాడ్‌ దేశాలతో బంధం బలోపేతం: ఈగిల్‌ చట్టానికి ఆమోదం

17 Jul, 2021 12:37 IST|Sakshi

ఈగిల్‌ చట్టానికి అమెరికా కమిటీ ఆమోదం

వాషింగ్టన్‌: క్వాడ్‌ దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశలో అమెరికా మరో అడుగు ముందుకేసింది. కీలకమైన ఈగిల్‌ చట్టం(ఎన్జూరింగ్‌ అమెరికన్‌ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌) అమలుకు ద హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. చైనాతో ఎదురయ్యే సవాళ్లకు సమాధానం చెప్పే దిశగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా దౌత్య, నాయకత్వ అంశాలను బలోపేతం చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడనుంది. అవసరమైన చోట చైనాతో పోటీపడడం, చైనా కుయుక్తులను బయటపెట్టడం, వనరులను బలోపేతం చేసుకోవడం కోసమే ఈ పాలసీ తెచ్చినట్లు యూఎస్‌ డెమొక్రాటిక్‌ జాక్విన్‌కాస్ట్రో చెప్పారు.

అదే విధంగా... ఇండోపసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను ఈ చట్టం కాపాడుతుందన్నారు. ఇందుకోసం నాలుగు దేశాలు(అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా) కలిసి ఇంట్రాపార్లమెంటరీ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని చట్టం సూచిస్తోంది. అలాగే యూఎస్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధుల పరిమితిని 6000 కోట్ల డాలర్ల నుంచి పదివేల కోట్ల డాలర్లకు పెంచాలని సూచించింది. అలాగే ఒలంపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా అడ్డుకునే రూల్‌50ని రద్దుచేయాలని అంతర్జాతీయ ఒలంపిక్‌ కమిటీని కోరనుంది. 2017లో క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు