ఘోరం: చుట్టుముట్టి కాల్చి చంపారు!

23 Aug, 2020 13:53 IST|Sakshi

వాషింగ్టన్‌​: అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల తుపాకీ గుళ్ల వర్షం కొనసాగుతోంది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ కాల్చివేతపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు ఎగిసినా పోలీసుల దుందుడుకు చర్యలు తగ్గడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. మృతున్ని ట్రేఫోర్డ్‌ పెల్లెరిన్‌గా గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి లుసియానాలోని లఫయెట్టే ప్రాంతంలో చోటుచేసుకుంది. బెన్‌ క్రంప్‌ అనే పౌర హక్కుల న్యాయవాది దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌ అయింది.
(చదవండి: బ్రిటన్‌లో మరో జార్జ్‌ ఫ్లాయిడ్‌!)

‘ఓ నల్ల జాతీయుడిని చట్టుముట్టిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. మారణాయుధం (కత్తి) ధరించిన సదరు వ్యక్తి తమ మాటల్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెప్పడం అత్యంత అమానవీయం. కత్తిని కలిగి ఉంటే చంపేస్తారా?’అని ఆయన ట్విటర్‌లో బెన్‌ క్రంప్‌ పేర్కొన్నారు. కాగా, జార్జ్‌ ఫ్లాయిడ్‌ కుటుంబం తరపున ఆయన కోర్టులో వాదిస్తున్నారు.
(చదవండి: ట్రంప్‌ నిజంగా మూర్ఖుడు.. అబద్దాల కోరు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు